జెట్‌ఎయిర్‌వేస్ అప్
- August 17, 2018
ముంబై: ఇటీవల ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసిక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు వచ్చిన వార్తలతో విమానయాన రంగ ప్రైవేట్ సంస్థ జెట్‌ఎయిర్‌వేస్ కౌంటర్ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 1.6 శాతం పెరిగి రూ.305 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.309వద్ద గరిష్టాన్నీ, రూ.303 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ నెల 27న బోర్డు సమావేశంకానున్నట్లు జెట్‌ఎయిర్‌వేస్ స్టాక్ ఎక్ఛేంజీలకు తెలియచేసింది. కాగా, భాగస్వామ్య సంస్థ జెట్ ప్రివిలేజ్‌లో వాటాను పిఇ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించనున్న సమాచారంలో గురువారం కూడా జెట్‌ఎయిర్‌వేస్ కౌంటర్ లాభపడిన సంగతి విదితమే. జెట్ ఎయిర్‌వేస్ వాటాకు రూ.3000నుంచి 4000కోట్ల వరకూ లభించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







