నేషనల్ డే సంబరాలు స్ఫూర్తినిస్తాయి
- December 15, 2015
మున్సిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థని, నేషనల్ డే సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయనీ, దేశభక్తిని పెంపొందిస్తాయనీ అన్నారు. జాతి ఐక్యతకు, అభివృద్ధికి ఇవెంతగానో దోహదం చేస్తాయని చెప్పారాయన. మినిస్ట్రీ ఆఫ్ మున్సిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ తరఫున ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీ మరియు ప్రభుత్వం, ఖతార్ ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో దేశం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మినిస్టర్ షేక్ అబ్దుల్‌రహమాన్ చెప్పారు. జాతి నిర్మాణంలో, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తగినంత సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని అబ్దుల్ రహమాన్ పిలుపునిచ్చారు. మినిస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖలు, మున్సిపాలిటీలు ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయవలసి ఉందనీ, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









