కేరళ వరదలపై మోదీ సమీక్ష
- August 17, 2018
కొచ్చి:కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించారు. కొచ్చిలో భారీవర్షం కురుస్తుండటంతో వరదపీడిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే చేయలేక పోయారు. దీంతో నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. కల్లిసరి ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుపోయిన 60 మందిని సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. 50 మంది సభ్యులున్న నేవీ బృందం చెంగనూర్ చేరుకొని వరదసహాయపనులు చేపట్టింది. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!