మణిరత్నం 'నవాబ్' సినిమా
- August 18, 2018
మణిరత్నం లేటెస్ట్ చిత్రం 'సెక్క సివంద వానం'. తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల కానుంది. ఇందులో శింబు, విజయ్‌సేతుపతి, అరవింద్‌స్వామి, అరుణ్‌విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఒక నవల ఆదరంగా తెరకేక్కుతుందని టాక్ .
దుర్యోధనుడు, కర్ణుడి స్నేహం ఇతివృత్తంగా రజనీ- మమ్ముట్టిలతో 'తలబది'(దళపతి), అంబాని జీవితంతో 'గురు', ఎంజీఆర్, కరుణానిధి జీవిత ఘట్టాల ఆధారంగా ప్రకాశ్‌రాజ్, మోహన్‌లాల్ నటించిన 'ఇరువర్'(ఇద్దరు) వంటి చిత్రాలను రూపొందించారు మణిరత్నం. ఇప్పుడు కూడా ఆయన 'పొన్నియిన్ సెల్వం' అనే చారిత్రాత్మక నవల ఆధారంగా 'సెక్క సివంద వానం' సినిమాను రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా మణిరత్నం ఇప్పుడు మునపటి ఫాం లో లేరు. ఓకే బంగారం తర్వాత కార్తీతో మణిరత్నం తీసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. 'చెక్క చివంత వానం' పేరుతో తమిళంలో, 'నవాబ్' పేరుతో తెలుగులో రాబోతున్న సినిమాకు విడుదల తేదీని కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కాబోతోందని లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి