మణిరత్నం 'నవాబ్‌' సినిమా

- August 18, 2018 , by Maagulf
మణిరత్నం 'నవాబ్‌' సినిమా

మణిరత్నం లేటెస్ట్ చిత్రం 'సెక్క సివంద వానం'. తెలుగులో 'నవాబ్‌' పేరుతో విడుదల కానుంది. ఇందులో శింబు, విజయ్‌సేతుపతి, అరవింద్‌స్వామి, అరుణ్‌విజయ్‌, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్‌ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఒక నవల ఆదరంగా తెరకేక్కుతుందని టాక్ .

దుర్యోధనుడు, కర్ణుడి స్నేహం ఇతివృత్తంగా రజనీ- మమ్ముట్టిలతో 'తలబది'(దళపతి), అంబాని జీవితంతో 'గురు', ఎంజీఆర్‌, కరుణానిధి జీవిత ఘట్టాల ఆధారంగా ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌లాల్‌ నటించిన 'ఇరువర్‌'(ఇద్దరు) వంటి చిత్రాలను రూపొందించారు మణిరత్నం. ఇప్పుడు కూడా ఆయన 'పొన్నియిన్‌ సెల్వం' అనే చారిత్రాత్మక నవల ఆధారంగా 'సెక్క సివంద వానం' సినిమాను రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా మణిరత్నం ఇప్పుడు మునపటి ఫాం లో లేరు. ఓకే బంగారం తర్వాత కార్తీతో మణిరత్నం తీసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. 'చెక్క చివంత వానం' పేరుతో తమిళంలో, 'నవాబ్' పేరుతో తెలుగులో రాబోతున్న సినిమాకు విడుదల తేదీని కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కాబోతోందని లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com