దావూద్ కీలక అనుచరుడు లండన్‌లో అరెస్టు

- August 19, 2018 , by Maagulf
దావూద్ కీలక అనుచరుడు లండన్‌లో అరెస్టు

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కీలక అనుచరుడు జబిర్ మోతీ లండన్‌లో అరెస్టయ్యాడు. శుక్రవారంనాడు హిల్టన్ హోటల్‌లో ఆయనను లండన్‌లోని ఛారింగ్ క్రాస్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు. లండన్, యూఏఈ, ఇతర దేశాల్లో దావూద్ పెట్టుబడుల వ్యవహారాలను జబిర్ మోతీ చూసుకునే వాడు. మోతీని అరెస్టు చేయాల్సిందిగా ఇండియా పలుమార్లు యూకేను గతంలో కోరింది. మాదకద్రవ్యాల స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, ఇతర నేర కార్యకలాపాల్లో మోతీకి ప్రమేయం ఉంది.
 
దావూద్ అత్యంత సన్నిహిత సహచరుడైన జబిర్ సిద్ధిఖ్ అలియాస్ జబిర్ మోతీ 'డీ కంపెనీ' ఫైనాన్స్ వ్యవహారాలు చూస్తుంటాడు. ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు యూకే భద్రతా సిబ్బంది ధ్రువీకరించింది. దావూద్‌, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో మోతీకి ఉన్న సంబంధాల గురించి దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్ జాతీయుడైన మోతీ... దావూద్‌కు, ఆయన భార్య మహజబీన్‌కు సన్నిహితంగా వ్యవహరించే వాడని చెబుతారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాశ్చం, యూకే, యూరప్, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా, పాకిస్థాన్‌లో దావూద్ పెట్టుబడులతో మోతీకి ప్రమేయం ఉంది. దావూడ్ పెట్టుబడుల నుంచి వచ్చే రాబడిలో ఎక్కువ మొత్తాన్ని పాకిస్ధాన్‌‌లోని టెర్రరిస్టు గ్రూపులకు వినియోగించే వాడని చెబుతున్నారు. దావూద్ ఇతర వ్యాపారాలైన మాదకద్రవ్యాల వ్యాపారం, అక్రమ ఆయుధాల సరఫరా, నకిలీ ఇండియన్ కరెన్సీ ముద్రణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను మోతీ చూసుకునేవాడు. కరాచీలో దావూద్ కుటుంబానికి చెందిన రెసిడెన్షియల్ కాంపౌండ్‌లో మోదీకి సొంతంగా కొన్ని ఆస్తులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. యూకేలో జబిర్ మోతీకి పదేళ్ల వీసా ఉంది. బరాబదూర్, ఆంటిగ్వా, డొమినికన్ రిపబ్లిక్‌లో ద్వంద్వ పౌరసత్వానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com