యూఏఈ ఆమ్నెస్టీ సదుపాయం వినియోగించుకోండి:కె.టి.ఆర్

- August 19, 2018 , by Maagulf
యూఏఈ ఆమ్నెస్టీ సదుపాయం వినియోగించుకోండి:కె.టి.ఆర్

హైదరాబాద్:యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో ప్రకటించిన ఆమ్నెస్టీ అవకాశాన్ని ప్రవాసులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు కోరారు. యూఏఈ ప్రకటించిన ఆమ్నెస్టీ గడువు ఆగస్టు-1 నుంచి అక్టోబరు-31 వరకు మూడు నెలల పాటు ఉందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కారణాలతో యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా రెగ్యులరైజ్‌ చేసుకోవచ్చని, పత్రాలు లేకుండా ఉంటున్నవారు తెలంగాణకు తిరిగి రావచ్చన్నారు. అలా తిరిగొచ్చిన వాళ్లు రెండేళ్ల నిషేధకాలం ముగిసిన తరువాత తిరిగి యూఏఈకి వెళ్లొచ్చని తెలిపారు.
 
పాస్‌పోర్ట్‌ లేని ప్రవాసులు సైతం ఈ ఆమ్నెస్టీ సమయంలో భారత్‌కు తిరిగి రావొచ్చని చెప్పారు. స్వదేశానికి రావాలనుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ప్రారంభించామన్నారు. వివరాలకు యూఏఈ కాన్సులేట్‌లోని హెల్ప్‌డెస్క్‌ +00971565463903, [email protected] హైదరాబాద్‌లోని హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఫోన్‌ 94408 54433, ఈ-మెయిల్‌ [email protected] పై సంప్రదించాలని మంత్రి కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com