అమర్‌నాథ్ యాత్రను 3 రోజులపాటు రద్దు చేసిన ప్రభుత్వం!
- August 20, 2018
అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం మూడు రోజలపాటు రద్దు చేసింది. నేటి నుంచి 23 వరకు వరకు లోయలోకి ఒక్కరిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, యాత్రను ఎందుకు రద్దు చేసిందన్న వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. బుధవారం బక్రీద్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈ నెల 26తో యాత్ర ముగుస్తుండడంతో యాత్రికుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి కేవలం 43 మందితో కూడిన యాత్రికుల బృందం లోయలోకి బయలుదేరింది. జూన్ 28న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2.82 లక్షల మంది భక్తులు అమరనాథుడ్ని దర్శించుకున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఇంతమంది దర్శించుకోవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!