దుబాయ్‌లో ఈ ఏడాది కొత్తగా 12 కొత్త స్కూల్స్
- August 20, 2018
దుబాయ్:ఈ అకడమిక్ ఇయర్‌లో దుబాయ్‌లో మొత్తగా 12 స్కూల్స్ అందుబాటులోకి రానున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీతో కూడిన స్కూల్ క్యాంపస్ ఇందులో ఒకటి కాగా, యూకేకి చెందిన ప్రముఖ స్కూల్ మరొకటి. 2018I18లో 169 దుబాయ్ ప్రైవేట్ స్కూల్స్ 257,000 మంది విద్యార్థులకు సేవలందించగా, 2018-19లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. సెప్టెంబర్ 2న చాలావరకు స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రీ-కెజి నుంచి 12వ గ్రేడ్స్ వరకు విద్యనభ్యసించేలా యూఏఈ తొలి సస్టెయినబుల్ స్కూల్ ఫెయిర్ గ్రీన్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతోంది. తమ విద్యార్థులకు ఈ స్కూల్ ఐబీ ప్రోగ్రామ్ అందించనుంది. దీంతోపాటుగా ది ఆర్బర్ స్కూల్, సౌత్ వ్యూ స్కూల్, బ్రింగ్‌టన్ స్కూల్, జెమ్స్ ఫౌండర్స్ స్కూల్, అక్విలా స్కూల్ యుకె, అల్ మవాకెబ్ స్కూల్ అల్ ఖవానీ, డ్యూన్‌క్రెస్ట్ అమెరికన్ స్కూల్, డ్విట్ స్కూల్, సోలోమన్ ఇంటర్నేషనల్ స్కూల్, అంబాసిడర్ స్కూల్ అల్ మన్‌ఖూల్, జెమ్స్ న్యూ అవర్ ఓన్ ప్రైవేట్ స్కూల్ షార్జా ఈ ఏడాది కొత్తగా దుబాయ్‌లో ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..