హాకీ లో హాంకాంగ్‌ పై భారత్ ఘన విజయం

- August 22, 2018 , by Maagulf
హాకీ లో హాంకాంగ్‌ పై భారత్ ఘన విజయం

జకార్తాః: ఆసియా గేమ్స్ పురుషుల హాకీలో టీమిండియా దూసుకెళ్లుతున్నది. నేడు గ్రూప్ ఏలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. హాంగ్‌కాంగ్‌పై 26-0 గోల్స్ తేడాతో నెగ్గింది. హాంగ్‌కాంగ్ ప్లేయర్లు ఎవరూ గోల్ చేయలేకపోయారు. గ్రూప్ మొదటి మ్యాచ్‌లోనూ ఇండోనేషియాపై 17-0 గోల్స్ తేడాతో నెగ్గిన విషయం విదితం. హాంగ్‌కాంగ్‌పై నలుగురు భారత ప్లేయర్లు హ్యాట్రిక్ గోల్స్ చేశారు. ఆకాశ్‌దీప్, రూపిందర్, లలిత్, హర్మన్‌ప్రీత్‌లు హ్యాట్రిక్ గోల్స్ చేసిన వారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com