'విశ్వాసం' ఫస్ట్ లుక్ రిలీజ్

- August 22, 2018 , by Maagulf
'విశ్వాసం' ఫస్ట్ లుక్ రిలీజ్

తల అజిత్ మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వాసం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో 'వి' అక్షరంతో తెరకెక్కిన అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు అజిత్ కి సూపర్ సక్సెస్ ను ఇవ్వడంతో తన తాజా చిత్రానికి కూడా మొదట లెటర్ వి ఉండేలా చూసుకున్నాడు అజిత్‌. విశ్వాసం అనే టైటిల్‌తో అజిత్ తాజా చిత్రం తెరకెక్కుతుండగా, ఈ రోజు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కోరమీసంతో రెండు గెటప్స్ లో విజయ్ లుక్ అదిరింది. పోస్టర్‌ని బట్టి చూస్తుంటే చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అనే డౌట్ అభిమానలులో కలుగుతుంది. ఈ చిత్రాన్ని వీరం, వేదాళం, వివేగం సినిమాల దర్శకుడు శివనే విశ్వాసం సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు.
విశ్వాసం చిత్రంలో అజిత్ ఓ డాన్‌గా కనిపించనుండగా, తొలిసారి ఈ సినిమా కోసం చెన్నై తమిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెబుతాడని సమాచారం. విశ్వాసం సినిమా అభిమానుల అంచనాలు మించేలా , చరిత్రలు తిరగరాసేలా తెరకెక్కుతుందని కోలీవుడ్ టాక్ . విశ్వాసం చిత్రంలో అజిత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది . గతంలో అజిత్‌తో కలిసి తొలిసారిగా ఏగన్ అనే చిత్రం చేసింది నయనతార . ఆ తర్వాత బిల్లా, ఆరంభం అనే చిత్రాలలో కలిసి నటించారు. ఇప్పుడు విశ్వాసం చిత్రంతో నాలుగో సారి జతకడుతున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com