విభేదాలను పరిష్కరించుకుందాం:రష్యా,టర్కీల నిర్ణయం
- August 25, 2018
మాస్కో:రష్యా యుద్ధ విమానాన్ని 2015లో టర్కీ కూల్చివేసినప్పటి నుండి నెలకొని వున్న విభేదాలను పరిష్కరించుకోవాలని రష్యా, టర్కీ నిర్ణయించాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్ తెలిపారు. టర్కీని తమ కీలకమైన వాణిజ్య, ఆర్థిక భాగస్వాముల్లో ఒకరిగా రష్యా పరిగణిస్తుందని లావ్‌రోవ్ పేర్కొన్నారు. టర్కీ విదేశాంగ మంత్రి మెవల్ట్‌తో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య టర్నోవర్ స్థిరంగా పెరుగుతూ వస్తోందని, గత ఏడాది కన్నా 40శాతం పైగా పెరిగి 2200కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారు. టర్కీ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌తో పాటు ఇరు దేశాలు ఉమ్మడిగా ఇంధన ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఇరు దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవని, మొత్తంగా యూరప్‌లో ఇంధన భద్రతకు కీలకమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







