సౌదీ అరేబియాలో 42 మంది పాకిస్థానీయులు మృతి
- August 25, 2018
రియాద్: హజ్ యాత్రకు వెళ్తూ సుమారు 42 మంది పాకిస్తానీలు సౌదీ అరేబియాలో మృతి చెందారని పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, రద్దీతో ఊపిరాడక మరికొందరు మరణించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో 12 మంది మహిళలు కాగా 30 మంది మగవారు ఉన్నారు. అయితే వీరంతా 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయసువారే. ఈ యేడాదిలో మొత్తం 1,84,210 మంది పాకిస్తాన్‌కు యాత్రికులు హజ్‌ను దర్శించడానికి సౌదీ అరేబియా చేరుకున్నారని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది కూడా ఇలాంటి దుర్ఘటనే ఒకటి సౌది అరేబియాలో చోటు చేసుకుంది. ఈజిప్టుకు చెందిన సుమారు 35 మంది హజ్ యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు. కాగా ఈ మృతులంతా 60 నుంచి 85 ఏళ్ల వయసువారే.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







