హైబీపీకి కారణమైయ్యే ఆహార పదార్థాలు ఇవే...
- August 25, 2018
హైబీపీ ఉండడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా గుండె ఎటాక్‌లు సంభవిస్తాయి. కనుక ఎవరైతే హైబీపీలో బాధపడుతున్నారో వారు ఈ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక హైబీపీ లేనివారు అటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినరాదు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి. దీని వలన హైబీపీ వస్తుంది.
కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా రక్తనాళాలు గట్టిగా మారుతాయి. దీని ఫలితంగా హైబీపీ వస్తుంది. కావున ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవలసి ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ వంటి సమస్యలు దరిచేరవు.
ముఖ్యంగా మద్యం సేవించే వారిలో బీపీ అధికంగా పెరుగుతుంది. కాఫీను తక్కువగా తాగడం లేదా దాన్ని పూర్తిగా మానేయడం వలన హైబీపీ వంటి వ్యాధులు ఉండవు. పాలతో తయార చేసే చీజ్‌లో రుచికోసం ఉప్పు అధికంగా వేస్తారు. తద్వారా శరీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినరాదు. ఇవి స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు ఏర్పడుతాయి.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







