బహ్రెయిన్:ప్రాస్టిట్యూషన్‌ రింగ్‌ మెంబర్స్‌కి జైలు

- August 27, 2018 , by Maagulf
బహ్రెయిన్:ప్రాస్టిట్యూషన్‌ రింగ్‌ మెంబర్స్‌కి జైలు

బహ్రెయిన్:ఐదుగురు ఆసియాకి చెందిన పురుషులు 10 మంది ఆసియాకి చెందిన మహిళలతో కూడిన ప్రాస్టిట్యూషన్‌ గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్రోతల్‌ని నిర్వహిస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. బలవంతంగా మహిళల్ని ప్రాస్టిట్యూషన్‌లోకి నిందితులు దించుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసియాకి చెందిన ఓ మహిళను మనామా బిల్డింగ్‌లో నిందితులు బంధించగా, ఆ కూపంలోంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు తెలపడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు ఆ భవనంపై దాడి చేసి, అందులోనివారిని అరెస్ట్‌ చేశారు. ఐదు నెలల క్రితం మెయిడ్‌గా పనిచేసేందుకు తాను బ్రహెయిన్‌కి వచ్చానని, ఉద్యోగమిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను ఈ రొంపిలోకి దించేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com