ఇండియా:డ్రోన్ల వినియోగం ఇక చట్టబద్ధం
- August 27, 2018
న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పలు నియమ నిబంధనలను ప్రకటించింది. ఈమేరకు వచ్చే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డ్రోన్ల వినియోగం చట్టబద్ధం కానున్నది. డ్రోన్లను వ్యవసాయం, ఆరోగ్యం, విపత్తు సహాయ పనుల్లో వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేందుకు కేంద్రం అనుమతించింది. ఆహార పదార్థాలు, సరుకుల రవాణాకు డ్రోన్ల వినియోగాన్ని అనుమతించబోమని ప్రభుత్వం సోమవారం తెలిపింది. సాధారణ పౌరులు డ్రోన్లను పగటిపూట మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. కంటిచూపు మేర అనగా 450 మీటర్ల ఎత్తుకు మించి వాటిని ఎగురనీయరాదని పేర్కొంది. నానో డ్రోన్లు, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, కేంద్ర నిఘా సంస్థలు ఉపయోగించే డ్రోన్లకు తప్ప మిగిలిన వాటన్నింటికీ ప్రత్యేక గుర్తింపు నంబర్ (యూఐఎన్) కేటాయిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం డ్రోన్లు విమానాశ్రయాల పరిసరాలు, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో, తీర ప్రాంతాలలో, రాష్ట్ర సచివాలయ ప్రాంగణాలలో ఎగురకూడదు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్‌ప్రభు సోమవారం డ్రోన్ల నిబంధనలను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో డ్రోన్ల మార్కెట్ లక్ష కోట్ల డాలర్లకు చేరవచ్చని చెప్పారు. పెండ్లిళ్ల ఫొటోగ్రఫీలో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు లేవని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!