కేరళ వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

- August 28, 2018 , by Maagulf
కేరళ వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

కేరళ:కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వరద బాధిత కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌ చెన్‌గన్నూర్‌కు వచ్చారు. అక్కడ ఓ పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్‌గన్నూర్‌, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటించనున్నారు. రేపు వాయాంద్‌ జిల్లాలో పర్యటన చేయనున్నారు. కొచ్చి విమానాశ్రయాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com