నాగార్జున బర్త్ డే గిఫ్ట్స్ ఇవే..
- August 28, 2018
టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జున రేపు పుట్టిన రోజు వేడుక జరుపుకోబోతున్నారు. ఈ సందర్బంగా నాగ చైతన్య , అఖిల్ లు బర్త్ డే కానుకగా తమ సినిమాలకు సంబందించిన విశేషాలను పంచబోతున్నారు. ప్రస్తుతం చైతు శైలజారెడ్డి అల్లుడు సినిమాతో రాబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 31న విడుదల కావాల్సింది వాయిదా పడింది. వచ్చే నెల 13న విడుదల అని వినిపించడమే కానీ అఫీషియల్ ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. అందుకే నాగ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ మూవీ ట్రయిలర్ విడుదల డేట్, సినిమా విడుదల డేట్ ప్రకటిస్తున్నారు.
ఇక రెండో గిఫ్ట్ అఖిల్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈయన మిస్టర్ మజ్ఞు అనే సినిమా చేస్తున్నాడు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా , బోగవిల్లి ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ గ్యాసిప్ ల్లో వుంది కానీ అఫీషియల్ ప్రకటన లేదు. దీంతో మిస్టర్ మజ్ఞు అంటూ అఫీషియల్ గా ఓ మోషన్ పోస్టర్ తో నాగ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తున్నారు. ఇలా తండ్రి పుట్టిన రోజు కు అభిమానులకు చైతు , అఖిల్ లు మంచి గిఫ్ట్లే ఇవ్వబోతున్నారు. మరి కోడలు సమంత ఏ గిఫ్ట్ ఇస్తుందో చూడాలి.
ప్రస్తుతం నాగార్జున హీరో నాని తో కలిసి దేవదాస్ చిత్రం చేస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రం గా రాబోతున్న ఈ మూవీ ఫై అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయ్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు సైతం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







