న్యూ ఒమన్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ వచ్చే నెలలో ప్రారంభం

- August 28, 2018 , by Maagulf
న్యూ ఒమన్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ వచ్చే నెలలో ప్రారంభం

మస్కట్‌:దుక్మ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద కొత్త ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ని సెప్టెంబర్‌ 17న ప్రారంభించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. దుక్మ్‌ ఎకనమిక్‌ జోన్‌ అలాగే స్టేట్‌ ఆఫ్‌ అల్‌ వుస్తా గవర్నరేట్‌ పరిధిలో ఈ కొత్త ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ ఎంతో ఉపయుక్తంగా వుంటుందనీ, స్థానికంగా సోషల్‌, ఎకనమిక్‌ అండ్‌ టూరిజం మూమెంట్‌ని పెంచేందుకు ఉపకరిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఫండమెంటల్‌ ఆపరేషన్‌ టెస్ట్‌ని పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సివిల్‌ ఏవియేషన్‌ సెక్టార్‌లో ఈ కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభం మరో మైలు రాయి అని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com