ఎస్కలేటర్‌ ప్రమాదం: ఒకరి మృతి

- August 28, 2018 , by Maagulf
ఎస్కలేటర్‌ ప్రమాదం: ఒకరి మృతి

మస్కట్‌:ఎస్కలేటర్‌ ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సుల్తానేట్‌ క్యాపిటల్‌లోని ఓ మాల్‌లో చోటు చేసుకుంది. నిర్మాణంలో వుండగా ఈ ఘటన జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొన్నారు. మాల్‌లో ఎలక్ట్రిక్‌ స్టెయిర్‌ కేస్‌ (ఎస్కలేటర్‌) కూలిందని ఈ ఘటనలో ఆసియాకి చెందిన కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో వివరించింది. విలాయత్‌ ఆఫ్‌ సీబ్‌లోని మాబెలాలో ఈ మాల్‌ నిర్మాణంలో వుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com