డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్: 8 మంది అరెస్ట్
- August 29, 2018
మస్కట్: నలుగురు వలసదారులతో సహా మొత్తం 8 మందిని డ్రగ్స్ పెడ్లింగ్, పొసెసింగ్ నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి 14 కిలోల మర్ఫిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ గ్యాంగ్‌తో కలిసి వీరు డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో కేసులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని విలాయత్ ఆఫ్ సీబ్‌లో అరెస్ట్ చేశారు. అతని నుంచి ఐదు కిలోల మరిజువానా మరియు మార్ఫిన్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడో కేసులో ఒమనీ జాతీయుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి 3,000 ప్యాకెట్ల ఖాత్‌ని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఆసియా జాతీయుల్ని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా, మరో ఆసియా జాతీయుడ్ని విలాయత్ ఆఫ్ షినాస్‌లో అరెస్ట్ చేశారు. మొత్తం అరెస్టయినవారందరినీ జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







