2న 'యాత్ర' నుంచి లిరికల్ వీడియో

- August 30, 2018 , by Maagulf
2న 'యాత్ర' నుంచి లిరికల్ వీడియో

దర్శకుడు మహి.వి రాఘవ్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను 'యాత్ర' పేరుతో రూపొందిస్తున్నాడు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ మమ్ముట్టి లుక్ మాత్రమే బయటికి వచ్చింది. ఆయన లుక్ వైఎస్ అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఎమోషనల్‌గా సాగే ఈ లిరికల్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. పాదయాత్ర నేపథ్యంలో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com