తమిళంలో రీమేక్ కానున్న 'నిన్ను కోరి'
- August 30, 2018ఒకప్పుడు మనోళ్ళు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలని ఎక్కువగా రీమేక్ చేసి విజయం సాధించేవాళ్ళు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మన సినిమాలనే వారు రీమేక్ చేసి సక్సెస్లని సాధిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ నటించిన టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలను తమిళం లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం కోలీవుడ్ కు వెళ్లనుంది.
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం నిన్ను కోరి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా తమిళ భాషలో రీమేక్ అవుతుంది. . యువ హీరో వైభవ్ నాని పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయట. కాస్మో కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..