తెలంగాణలో కొత్త జోన్లు ఇవే..
- August 30, 2018తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపింది. 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రపతి సంతకంతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో.. తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జోన్ల విషయానికి వస్తే..
జోన్1 కాళేశ్వరం జోన్. భూపాలపల్లి జయశంకర్ జిల్లా, ఆసిఫాబాద్-కొమ్రం భీమ్ జిల్లా, రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంతం దీనికిందకు వస్తుంది.
జోన్2కు బాసర పేరు పెట్టారు. దీని పరిధిలో.. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతాలు వస్తాయి.
జోన్3 విషయానికి వస్తే.. దీనికి రాజన్న జోన్‌గా నామకరణం చేశారు. కరీంనగర్, సిద్ధిపేట్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతాలు, కామారెడ్డి, మెదక్, సిరిసిల్లా రాజన్న జిల్లాలు ఉన్నాయి.
జోన్4కు.. భద్రాద్రి పేరు పెట్టారు. దీని పరిధిలో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషరేట్లు, మహబూబాబాద్, కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జోన్లు మల్టీజోన్-1లో చేర్చారు.
ఐదో జోన్‌కు… యాదాద్రిగా నామకరణం చేశారు. ఇందులో సూర్యాపేట్, నల్గొండ జిల్లాలు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంతం ఉన్నాయి.
ఆరో జోన్‌కు… చార్మినార్ పేరు పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతాలతో పాటు సంగారెడ్డి జిల్లాను ఇందులో చేర్చారు.
చివరది జోగులాంబ జోన్. ఇందులో మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, వికారాబాద్, గద్వాల్-జోగులాంబ జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జోన్లు మల్టీజోన్2లో చేర్చారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..