ఫుజేరా లో 26 ఏళ్ళ ఎమిరాతి మృతి

- August 30, 2018 , by Maagulf
ఫుజేరా లో 26 ఏళ్ళ ఎమిరాతి మృతి

ఫుజేరా: 26 ఏళ్ళ ఎమిరాతి వ్యక్తి ఫుజేరా లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఫుజేరా లోని మౌంటెయిన్స్‌లో మృతుడ్ని కనుగొన్నారు. ఫుజేరా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కుటుంబ సభ్యులు మృతుడి ఆచూకీ కోసం కొన్నాళ్ళుగా వెతుకుతున్నారు. పోలీసులకు సైతం ఈ మేరకు వారు ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటనా స్థలంలో పరిస్థితుల్ని బట్టి ఎమిరేటీ వ్యక్తి మృతి వెనుక ఎలాంటి క్రిమినల్‌ ఇంటెంట్‌ వుండి వుండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణ జరుగుతోందనీ, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఫుజేరా పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com