రాయల్ హాస్పిటల్‌లో 300 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్
- August 30, 2018
మస్కట్: 1988 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఒమన్ హాస్పిటల్ 300 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్ర చికిత్సలు నిర్వహించింది. వీటిల్లో 95 శాతానికి పైగా సక్సెస్ రేట్ వుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యంత సమర్థత కలిగిన వైద్యుల కారణంగానే ఈ ఘనత సాధ్యమయ్యిందని రాయల్ హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి సంబంధించి తొలి అడుగు సుల్తానేట్‌లో 1973లో పడింది. స్పెషలైజ్డ్ మెడికల్ స్టాఫ్‌తో అత్యంత పకడ్బందీగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్ర చికిత్సలు చేయాల్సి వుంటుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్‌లో ట్రెయినింగ్ పొందిన సమర్థులు మాత్రమే ఈ తరహా శస్త్ర చికిత్సలు చేయగలరని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శస్త్ర చికిత్సకు ముందు, ఆ తర్వాత రోగి విషయంలో తీసుకునే జాగ్రత్తల్ని బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి వుంటుందని, ఈ విషయంలో తమ ఆసుపత్రికి బెస్ట్ రికార్డ్ వుందని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







