దోఫార్‌లో అరేబియన్‌ లెపార్డ్‌ని చిత్రీకరించిన కెమెరాలు

- August 30, 2018 , by Maagulf
దోఫార్‌లో అరేబియన్‌ లెపార్డ్‌ని చిత్రీకరించిన కెమెరాలు

మస్కట్‌: ట్రాప్‌ కెమెరాలు, దోఫార్‌ గవర్నరేట్‌లో అరుదైన, అంతరించిపోయే దశలో వున్న అరేబియన్‌ లెపార్డ్‌ని క్యాచ్‌ చేశాయి. రాయల్‌ కోర్ట్‌ ఆఫ్‌ దివాన్‌ ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎఫైర్స్‌ సలాలా కన్సర్వేషన్‌ ఎఫర్ట్స్‌లో భాగంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయుసిఎన్‌) రెడ్‌ లిస్ట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 200 మాత్రమే అరేబియన్‌ లెపార్డ్స్‌ వున్నాయి. ఒమన్‌లో ఈ లెపర్డ్‌ని ప్రొటెక్షన్‌ చేసేందుకు కఠిన చట్టాలున్నాయి. ఈ చట్టం ప్రకారం అరేబియన్‌ లెపర్డ్‌ని వేటాడినా, పట్టుకున్నా ఆరు నెలల నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష, 1,000 నుంచి 5,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధిస్తారు. దోఫార్‌తోపాటు నార్త్‌ ఈస్టర్న్‌ యెమన్‌లోని హావ్‌ఫ్‌ ప్రాంతంలోనూ, అలాగే చాలా తక్కువగా సౌదీ అరేబియాలోనూ ఈ అరేబియన్‌ లెపర్డ్స్‌ దర్శనమిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com