లిబియా శిబిరాల్లో తిండి, నీరు లేక అలమటిస్తున్న శరణార్థులు

- August 30, 2018 , by Maagulf
లిబియా శిబిరాల్లో తిండి, నీరు లేక అలమటిస్తున్న శరణార్థులు

ట్రిపోలి:యూరప్‌ చేరుకుందామని బయలుదేరిన వందలాదిమంది శరణార్ధులు లిబియాలో ప్రభుత్వ అధీనంలోని శిబిరాల్లో చిక్కుకుపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు లేకుండా అలమటిస్తున్నారు. వీరిలో ఐదేళ్ళు నిండని చిన్నారులతో సహా మహిళలు పెద్ద సంఖ్యలో వున్నారు. ట్రిపోలిలో ప్రత్యర్ధి వర్గాల మధ్య పోరు ఉధృతం కావడంతో శరణార్ధులు, వలసవాదులను ఎవరూ పట్టించుకునేవారే లేరు. ట్రిపోలికి దక్షిణంగా గల ప్రభుత్వ శిబిరమైన అయిన్‌ జరాలో వందలాదిమంది ప్రజలు కిక్కిరిసిపోయి వున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్కర్‌ ఒకరు తెలిపారు. ఆ నిర్బంధ శిబిరంలో దాదాపు 400మందికి పైగా వున్నారు. వారిలో 200మంది వరకు మహిళలు, 200మందికి పైగా పురుషులు వున్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులు 20మంది వరకు వున్నారని, వీరు తిండి, నీరు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరో మూడు శిబిరాల్లో 1500 వరకు వున్నట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో కొంతమంది పారిపోగా, మరికొంతమందిని ఇతర శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com