ఇండియాలో కూడా రానున్న 'UBER' ఫ్లయింగ్ క్యాబ్స్
- August 30, 2018ఇండియా:మీరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు చా ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అని అనుకున్నారా వెంటనే ఏ ఫ్లైటో వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తే బాగుండునని కలలు కన్నారా.... త్వరలో ఇవన్నీ నిజం కాబోతున్నాయి. అవును ఇది అక్షరాలా నిజం. ఎక్కడికైనా త్వరగా వెళ్లాలంటే Uber క్యాబ్ బుక్ చేయడం మీకు అలవాటు ఉండేవాళ్ళు ఇంకా త్వరగా వెళ్లాలంటే మాత్రం ఇక పై Uber ఫ్లయింగ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇదంతా జరగడానికి ఎన్నో ఏళ్లు పట్టదు. త్వరలో ఇండియాలో Uber ఫ్లయింగ్ క్యాబ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి . వచ్చే ఐదేళ్లలో ఈ కల నెరవేరే అవకాశముంది.
ఐదు దేశాలను ఎంపిక చేసింది....
ఫ్లయింగ్ క్యాబ్ సర్వీస్ లాంఛ్ చేయడానికి ఊబెర్ కంపెనీ ఐదు దేశాలను ఎంపిక చేసింది. అందులో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ప్రాన్స్, జపాన్ దేశాలు కూడా ఉన్నాయి.
టోక్యోలో జరిగిన "Uber Elevate Asia Pacific"ఎక్స్‌పోలో ఈ ప్రకటన చేసింది ఉబెర్ కంపెనీ. ఇప్పటికే Uber Elevate అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజిల్స్‌ని ఎంపిక చేసింది కంపెనీ. ఎంపిక చేసిన ఐదు దేశాల నుంచి ఒక్కో నగరాన్ని సెలెక్ట్ చేస్తుంది Uber .
Uber ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే మీరు కూర్చున్న చోట ఓ క్లిక్ చేస్తే చాలు ఫ్లైట్ వచ్చి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆసియా పసిఫిక్ నగరాల్లో Uber ఎయిర్ రూట్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో స్థానిక రవాణా వ్యవస్థకు ఎంత ఉపయోగపడ్తాయో కంపెనీ వివరించింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..