బాలిస్టిక్ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్ చేసిన సౌదీ
- August 30, 2018
జెడ్డా:సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్‌ని కూల్చివేశాయి. నజ్రాన్ వైపుగా ఈ మిస్సైల్‌ని తీవ్రవాదులు ప్రయోగించారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. కింగ్డమ్పై ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు మిస్సైళ్ళతో దాడికి యత్నించడం ఇదే తొలిసారి కాదు. దాదాపు 180 మిస్సైళ్ళను సౌదీ వైపు ఇటీవలి కాలంలో తీవ్రవాదులు ప్రయోగించారు. పౌరులు ఎక్కువగా నివసించే ప్రాంతాలే లక్ష్యంగా మిసైళ్ళతో దాడికి యత్నిస్తున్నారు తీవ్రవాదులు. అయితే అత్యంత చాకచక్యంగా సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆ మిస్సైళ్ళను ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







