తెలుగు అమ్మాయితో కర్ణాటక సీఎం కొడుకు పెళ్లి!
- August 31, 2018
అమరావతి:త్వరలోనే విజయవాడ అమ్మాయితో కర్నాటక సీఎం కుమారుడి పెళ్లి జరగబోతోంది. కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహం.. కృష్ణాజిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో జరిపించేందుకు మాటలన్నీ ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలు రఘురామకృష్ణంరాజు, లగడపాటి రాజగోపాల్ పెళ్లిపెద్దలుగా వ్యవహరించబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు ఎక్కడ జరపాలి లాంటి మాటలన్నీ పూర్తయ్యే వరకూ మిగతా వివరాలన్నీ గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు. కర్నాటక సీఎం కుమారస్వామి ఇవాళ ఉదయాన్నే సతీసమేతంగా విజయవాడకు వచ్చారు. కాసేపట్లో దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని కూడా దర్శించుకోబోతున్నారు.
విజయవాడ వచ్చిన కుమారస్వామిని ఏపీ సీఎం చంద్రబాబు కలిసారు. గేట్వే హోటల్కి వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో రఘురామకృష్ణం రాజు, లగడపాటి రాజగోపాల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పెళ్లి అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
బెంగళూరులో ఉండే కుమారస్వామికి , విజయవాడ పారిశ్రామిక వేత్తకు మధ్య వియ్యం కలిపేందుకు ఎవరు ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కుమారస్వామే వెల్లడిస్తారని అంటున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







