ప్రయాణీకులకు ఫ్లై దుబాయ్ సూచన
- December 17, 2015
ఫ్లై దుబాయ్ తమ ప్రయాణీకులు సరైన సమయంలో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. సరైన సమయానికి రాకుండా, ఒకేసారి ప్రయాణీకులంతా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో తాత్కాలిక రద్దీ ఏర్పడుతోందనీ, దీని ద్వారా ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతోందని ఫ్లై దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఈ వారాంతంలో 12 వేల మందికి పైగా ప్రయాణీకులు ఫ్లై దుబాయ్ విమానాల ద్వారా అమ్మాన్, బీరుట్, జెడ్డా, మస్కట్ మరియు శ్రీలంకకు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామనీ, ట్రాఫిక్ సహా అనేక ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణాలకు ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ముందస్తుగా విమానాశ్రయానికి చేరుకోవడం మంచిదని ఫ్లై దుబాయ్ అధికారులు సూచన ప్రకటన విడుదల చేశారు. గంట ముందు చెక్ ఇన్ వుంటుందనీ, ఆన్ లైన్‌లో చెకిన్ సౌకర్యం వున్నప్పటికీ, బ్యాగేజ్ చెకింగ్‌కి గంట సమయం పడుతుంది గనుక, ఫ్లైట్ డిపాచ్యూర్‌కి గంట ముందే, వీలైతే ఇంకా ముందే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. హోవర్ బోర్డ్స్, బ్యాలెన్స్ వీల్స్ వంటి లిథియమ్ బ్యాటరీ వస్తువులను విమానాల్లోకి అనుమతించరు. లిక్విడ్స్, ఏరోసోల్స్ మరియు జెల్స్ పూర్తిగా రీసీల్ చేయబడ్తాయి. ప్రయాణీకులు ఇవన్నీ గుర్తించగలరు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







