తెలుగు అమ్మాయితో కర్ణాటక సీఎం కొడుకు పెళ్లి!

- August 31, 2018 , by Maagulf
తెలుగు అమ్మాయితో కర్ణాటక సీఎం కొడుకు పెళ్లి!

అమరావతి:త్వరలోనే విజయవాడ అమ్మాయితో కర్నాటక సీఎం కుమారుడి పెళ్లి జరగబోతోంది. కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహం.. కృష్ణాజిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో జరిపించేందుకు మాటలన్నీ ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలు రఘురామకృష్ణంరాజు, లగడపాటి రాజగోపాల్‌ పెళ్లిపెద్దలుగా వ్యవహరించబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు ఎక్కడ జరపాలి లాంటి మాటలన్నీ పూర్తయ్యే వరకూ మిగతా వివరాలన్నీ గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు.  కర్నాటక సీఎం కుమారస్వామి ఇవాళ ఉదయాన్నే సతీసమేతంగా విజయవాడకు వచ్చారు. కాసేపట్లో దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని కూడా దర్శించుకోబోతున్నారు.

విజయవాడ వచ్చిన కుమారస్వామిని ఏపీ సీఎం చంద్రబాబు కలిసారు. గేట్‌వే హోటల్‌కి వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో రఘురామకృష్ణం రాజు, లగడపాటి రాజగోపాల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పెళ్లి అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

బెంగళూరులో ఉండే కుమారస్వామికి , విజయవాడ పారిశ్రామిక వేత్తకు మధ్య వియ్యం కలిపేందుకు ఎవరు ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కుమారస్వామే వెల్లడిస్తారని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com