మస్కట్:వర్కర్స్ అకామడేషన్‌లో అగ్ని ప్రమాదం
- August 31, 2018
మస్కట్: బౌషర్‌లోని వర్కర్స్ అకామడేషన్ కారవాన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకుండా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ ఘటనను ధృవీకరించింది. సమాచారం అందగానే పిఎసిడిఎ ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బౌషర్ సివిల్ డిఫెన్స్ సెంటర్ నుంచి ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.విలాయత్ ఆఫ్ బౌషెర్‌లోని అల్ మునా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఓనర్లు, కాంట్రాక్టర్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందనీ, అగ్ని ప్రమాదం సంభవించకుండా అప్రమత్తంగా వుండాలని పిఎసిడిఎ పేర్కొంది. సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ సూచించే సేఫ్టీ రిక్వైర్‌మెంట్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







