ఒమన్‌లో పలు షాప్‌లను షట్‌డౌన్‌ చేసిన మున్సిపల్‌ అథారిటీస్‌

- August 31, 2018 , by Maagulf
ఒమన్‌లో పలు షాప్‌లను షట్‌డౌన్‌ చేసిన మున్సిపల్‌ అథారిటీస్‌

మస్కట్‌: సుల్తానేట్‌ క్యాపిటల్‌లో పలు షాప్‌లను మున్సిపల్‌ అథారిటీస్‌ షట్‌ డౌన్‌ చేయడం జరిగింది. లైసెన్సులు లేకపోవడం, లైసెన్సుల నాన్‌ రెన్యువల్‌ వంటి అంశాలకు సంబంధించి ఈ షట్‌ డౌన్స్‌ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మస్కట్‌ మునిసిపాలిటీ ఫీల్డ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌, సీబ్‌లో పలు షాప్‌లను మూసివేసినట్లు పేర్కొన్నారు ఓ అధికారి. అల్‌ ఖౌద్‌, రుసాయిల్‌ మరియు అల్‌ జాఫిన్‌లో ఈ షట్‌ డౌన్స్‌ జరిగాయి. మునిసిపల్‌ చట్టాలకు విరుద్ధంగా షాప్‌లను నిర్వహిస్తుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టతనిచ్చారు.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com