హైదరాబాద్‌లో ముజ్రా పార్టీ..
- August 31, 2018హైదరాబాద్‌కు మరో చెత్త సంస్కృతి దిగుమతి అవుతోంది. పాతబస్తీలో జూపార్క్ సమీపంలోని ఓ లాడ్జిలో ముజ్రా పార్టీ నిర్వహించారు. అదే పార్టీలో మద్యం సేవించి మత్తులోకి వెళ్లిన ఓ యువతిపై.. ఖుద్దూస్ అనే యువకుడు అత్యాచార యత్నం చేశాడు.
కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహించడం.. యువతిపై అత్యాచార యత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు లాడ్జిపై దాడులు చేశారు. ముగ్గురు యువతులు, ఐదుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు మైనర్లు ఉన్నారు.
హైదరాబాద్‌లో ఈమధ్య పెడధోరణులు పెరిగిపోతున్నాయి. పాష్ కల్చర్ పేరుతో నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు, సిటీలోని లాడ్జిల్లో ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అత్యాచార యత్నానికి పాల్పడడం పరాకాష్టగా భావిస్తున్నారు. మద్యం మత్తులోని మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన పాతబస్తీ అనుమానితుడు ఖుద్దూస్పై నిర్బయ చట్టం కింద కేసు పెట్టారు. మిగతా వారిపై కోప్టా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు