'దుబాయ్ పవనిజం'ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
- September 01, 2018దుబాయ్:గత రాత్రి దుబాయ్ లోని అల్ ఖైల్ మాల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 47వ పుట్టిన రోజు వేడుకలను అభిమాన సంఘం 'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.మధ్యాహ్నం అభిమానులు 100 మంది పైగా రక్త దానం చేసారు.రక్త దానం చేసిన పలువురి అభిమానులను సన్మానించారు.సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు ఒక పండగ దినం.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినమైన ఈ తేదీన దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటారు పవన్ అభిమానులు.కాని పవన్ అభిమానులు గల్ఫ్ లో శుక్రవారం సెలవు కనుక పుట్టిన రోజు వేడుకలు ముందుగానే జరుపుకున్నారు.
సాయంత్రం మహిళా అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసారు.తదనంతరం అభిమానులకు కార్యక్రమ నిర్వాహకులు విందు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ అభిమానులు,జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!