'ఇండిగో' ఎయిర్లైన్స్ వారి బంపర్‌ ఆఫర్‌

- September 03, 2018 , by Maagulf
'ఇండిగో' ఎయిర్లైన్స్ వారి బంపర్‌ ఆఫర్‌

 న్యూఢిల్లీ:బడ్జెట్‌ ఎయిర్‌లైనర్‌ ఇండిగో విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. తన విమానాల్లో పరిమిత కాలానికి రూ 999కు వన్‌వే జర్నీని అందిస్తూ సోమవారం నుంచి మూడు రోజుల పాటు పది లక్షల ప్రమోషనల్‌ సీట్లను అమ్మకానికి ఉంచింది. సోమవారం నుంచి నాలుగు రోజుల ఫెస్టివ్‌ సేల్‌ కింద టికెట్లు బుక్‌ చేసుకునే వారు ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ ప్రయాణ వ్యవధిలో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్‌ కింద మొబైల్‌ వ్యాలెట్‌ మొబిక్విక్‌ ద్వారా బుక్‌ చేసుకునేవారికి రూ 600 సూపర్‌ క్యాష్‌ అమౌంట్‌ను ఇండిగో ఆఫర్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 3 నుంచి 6 వరకూ తాము ప్రకటించిన నాలుగు రోజుల ఫెస్టివ్‌ సేల్‌ ఆఫర్‌లో రూ 999 నుంచి విమాన చార్జీలు అందుబాటులో ఉంటాయని, కస్టమర్లకు ఇది మంచి అవకాశమని ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ చెప్పారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండిగో ఈ తరహా ఆఫర్లతో వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 160 విమానాలు కలిగి ఉన్న ఇండిగో రోజుకు ఎనిమిది అంతర్జాతీయ, 52 దేశీయ గమ్యస్ధానాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com