సోషల్‌ మీడియాలో ఫొటో పోస్టింగ్‌: ఓ వ్యక్తి హత్య

- September 03, 2018 , by Maagulf
సోషల్‌ మీడియాలో ఫొటో పోస్టింగ్‌: ఓ వ్యక్తి హత్య

బహ్రెయినీ స్టూడెంట్‌, సుడానీ స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోల పోస్టింగ్‌కి సంబంధించి ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవే సుడానీ వ్యక్తిని బహ్రెయినీ స్టూడెంట్‌ హత్య చేయడానికి కారణంగా తెలుస్తోంది. గ్రూప్‌ రోడ్‌ ట్రిప్‌కి వెళ్ళిన ఈ ఇద్దరూ ఆ ట్రిప్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ అవడంపై గొడవ పడ్డారు. ఆ ఫొటోల కింద ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్‌ చేసుకోవడంతో గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం బహ్రెయినీ వ్యక్తి, సుడానీ ఫ్రెండ్‌ని కత్తితో ఛాతిలో పొడిచి చంపాడు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com