ఫేస్బుక్లో సరికొత్త అప్డేట్..!
- September 03, 2018
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నూతన అప్డేట్ను ప్రవేశబెట్టింది . ప్రపంచంలోని అన్ని భాషల యూజర్లకు ఫేస్‌బుక్‌ను మరింత దగ్గర చేసేందుకుగాను సంస్థ తన భాషా అనువాద (లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్) విభాగాన్ని పటిష్ట పరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోగించి ఇతర భాషల్లో పెట్టే ఫేస్‌బుక్‌లోని పోస్టులు, కామెంట్లను కచ్చితంగా, తక్కువ సమయంలో ఏ బాషలో అయిన ట్రాన్స్‌లేట్ చేయగలిగే నూతన అప్డేట్ను ప్రవేశబెట్టింది. దీని వలన ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా ఈ నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.
కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే....
ప్రస్తుతం ఫేస్బుక్లో అందుబాటులో ఉన్న అనువాద వ్యవస్థ వళ్ళ కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే యూజర్లకు సులువుగా వారికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేట్ చేయగలవు. అయితే ఇప్పటి నుంచి ఆ పరిస్థితి రాకుండా సులువుగా వారికీ కావాల్సిన బాష లో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
ఉర్దూ, బర్మీస్ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్ చేయడంలో .....
అయితే ఉర్దూ, బర్మీస్ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.కాగా ఇలాంటి వాటిని అధిగమించేందుకు గాను మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్‌లోకి వికిపీడియా లాంటి వెబ్‌సైట్‌ల్లోని వేర్వేరు భాషల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాఖ్యాలను అప్లోడ్ చేసింది.
యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో.....
ఈ ట్రాన్స్‌లేట్ ద్వారా ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా ఈ నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.
ట్రాన్స్‌లేట్ ఎలా చేయాలంటే....
మరొక భాషలో వ్రాయబడిన పోస్ట్ లేదా కామెంట్ ను అనువదించడానికి, పోస్ట్ లేదా కామెంట్ క్రింద ట్రాన్స్‌లేట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.మీరు మరొక భాషలో వ్రాయబడిన పోస్ట్ లేదా కామెంట్ క్రింద అనువాద ఎంపికలను చూడకపోతే, ఆ భాషకు అనువాద ఎంపికలు ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







