వెదర్ అలర్ట్: డస్ట్, లో విజిబిలిటీ
- September 04, 2018
యూఏఈ: వాహనదారులను ఉద్దేశించి నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) సూచనలతో కూడిన హెచ్చరిక జారీ చేసింది. రోడ్లపై పూర్ విజిబిలిటీ వుంటుందనీ, డస్ట్ ఎక్కువగా పైకి లేస్తుందనీ ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని ఆ హెచ్చరికలో పేర్కొంది ఎన్సిఎం. ఓ మోస్తరు నుంచి కాస్త ఎక్కువగానే డస్ట్, కోస్టల్ ఏరియాల్లోనూ ఇంటర్నల్ ఏరియాస్లోనూ వుంటాయనీ, ఈ కారణంగా 2,000 మీటర్ల కంటే తక్కువకు విజిబిలిటీ లెవల్స్ పడిపోతాయని పేర్కొంది. ఇదిలా ఉంటే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే సాయంత్రం, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఆ సమయాల్లో బయటకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కొద్ది వారాల్లోనే ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయి. అయితే హ్యుమిడిటీ లెవల్స్ ఎక్కువగా వుండడం, పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడం మామూలేనని ఎన్సిఎం పేర్కొంది. బుధవారం 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గవచ్చు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







