కాంట్రాక్ట్‌ల రద్దు: రెంటల్స్‌ తగ్గుముఖం

- September 04, 2018 , by Maagulf
కాంట్రాక్ట్‌ల రద్దు: రెంటల్స్‌ తగ్గుముఖం

మస్కట్‌: 2017లో పెద్ద సంఖ్యలో రెంట్‌ కాంట్రాక్ట్స్‌ రద్దయినట్లు మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. రద్దయిన రెంటల్‌ కాంట్రాక్ట్‌ల సంఖ్య 25.2 శాతం మేర తగ్గింది. మేజర్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం కోసం ఇచ్చే పర్మిట్స్‌ విషయంలోనూ 14.9 శాతం తగ్గుదల నమోదయ్యింది. కొత్తగా 43,564 రెంటల్‌ కాంట్రాక్టులు రిజిస్టర్‌ కాగా, గతంతో పోల్చితే ఇది 7 శాతం తక్కువ. క్యాన్సిల్‌ అయిన రెంటల్‌ కాంట్రాక్ట్స్‌ విషయాఇనకొస్తే ముట్రా 63 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. కురియాత్‌ 37 శాతంతో రెండో స్థానంలో, అల్‌ సీబ్‌ 20 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. కాంట్రాక్ట్స్‌ రెన్యూవల్‌ 2016తో పోల్చితే 2017లో 21 శాతం పెరిగింది. వేకెన్సీ రేట్స్‌లో పెరుగుదల నమోదు కాగా, రెంట్స్‌లో 30 శాతం తగ్గుదల నమోదయ్యిందని రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పర్ట్స్‌ పేర్కొంటున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com