వీకెండ్‌ వెదర్‌: అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం!

- September 06, 2018 , by Maagulf
వీకెండ్‌ వెదర్‌: అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం!

యూఏఈ: వీకెండ్‌ వెదర్‌ విషయంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ యూఏఈ వాసులకు తీపి కబురు అందించింది. ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గనున్నట్లు వీకెండ్‌ ప్రియులకు ఆ తీపి కబురు తెలిపింది. అయితే సాధారణం నుంచి ఓ మోస్తరు గాలుల కారణంగా డస్ట్‌ ఎక్కువగా 'బ్లో' అవుతుంది. ఈ కారణంగా విజిబిలిటీ తగ్గుతుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. అత్యల్ప ఉష్ణోగ్రత యూఏలోని జైస్‌ మౌంటెయిన్స్‌ వద్ద 24.8 డిగ్రీస్‌ సెల్సియస్‌గా నమోదయ్యింది. అరేబియన్‌ గల్ఫ్‌ మరియు ఒమన్‌ సీ సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. ఈ వారంతమంతా ఇదే పరిస్థితులు కొనసాగుతాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. పగటి పూట కాస్త వేడిగానే వుంటుంది. హ్యుమిడిటీ కూడా ఎక్కువగానే వుండొచ్చు. అక్కడక్కడా మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com