ఆసియా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన భారత సైనికులు

- September 06, 2018 , by Maagulf
ఆసియా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన భారత సైనికులు

భారత దేశ సరిహద్దుల్లో ఎలాంటి సవాల్‌నైనా ధైర్యంగా ఎదురుకొని మనం ప్రశాంతంగా మనుగడ సాగించేందుకు రక్షణ కవచంగా నిలుస్తున్నదే భారత సైన్యం. సరిహద్దులోనే కాదు పకృతి విద్వసానికి బలైన సామన్యులకు అండగా నిలవడంలో మన సైన్యం ఎప్పుడు ముందు ఉంటుంది.వారి ధైర్యం అసమానం. వారి పోరాట స్ఫూర్తి అనన్య సామాన్యం. ఇప్పుడు వారి ప్రతిభ ఖండాంతరాలు దాటింది. ఇండోనేషియాలో జరిగిన 18వ ఆసియా క్రీడల్లో భారత సైన్యానికి చెందిన క్రీడాకారులు 11 పతకాలు గెలిచారు. ఈ క్రీడల్లో భారత్‌ రికార్డు స్థాయిలో 69 పతకాలు సాధించింది.

తాజాగా ఆసియా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సైనికులకు బుధవారం ఢిల్లీలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ పాల్గోన్నారు. పథకాలను సాధించిన విజేతలను ఆయన అభినందించారు.ఈ సంధర్భంగా మాట్లడుతూ ” ఇప్పుడు మనం చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమే రాబోయే టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మన క్రిడకారులు పూర్తి సినిమా చూపిస్తారు” అన్నారు.

ఇంతకన్నా ఎక్కువ పతకాలను వస్తాయని అంచనావేశాను.అయన ఫలితాలు నన్ను అసంతృప్తికి గురిచేయలేదు. ఆటగాళ్లు మెరుగైన ప్రతిభ కనపరిచేలా విదేశాల్లో సైతం శిక్షణ ఇప్పించేందుకు సిద్ధం. ఒలింపిక్స్‌ లో మరిన్ని పథకాలు సాధించేందుకు ఆర్మీ యాచింగ్‌ నోడ్‌, ఆర్మీ ఈక్వెస్ట్రియాన్‌ నోడ్‌, ఆర్మీ మార్స్క్‌మన్‌ ,ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆర్మీ రోహింగ్‌ నోడ్‌, యూనిట్లు పనిచేస్తున్నాయి’ అని రావత్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com