హత్య కేసులో తీర్పు సెప్టెంబర్‌ 25న

- September 07, 2018 , by Maagulf
హత్య కేసులో తీర్పు సెప్టెంబర్‌ 25న

బహ్రెయిన్:హమాద్‌ టౌన్‌లో తన గర్ల్‌ ఫ్రెండ్‌ని హత్య చేసిన బహ్రెయినీకి శిక్ష ఖరారు చేయనుంది హై అప్పీల్స్‌ కోర్ట్‌. సెప్టెంబర్‌ 25న తీర్పుని వెల్లడించబోతోంది న్యాయస్థానం. 2017 మే 27న ఈ హత్య జరిగింది. స్క్రూ డ్రైవర్‌ సహాయంతో 31 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, 25 ఏళ్ళ మహిళను అతి కిరాతకంగా చంపేశాడు. గత ఏడాది మార్చిలో ఈ కేసుకు సంబంధించి హై క్రిమినల్‌ కోర్ట్‌, నిందితుడ్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. గత నవంబర్‌లో హై అప్పీల్స్‌ కోర్ట్‌ తీర్పుని అప్‌హెల్డ్‌ చేయగా, బహ్రెయిన్‌ కాస్సేషన్‌ కోర్ట్‌, న్యూ ట్రయల్‌కి పంపడంతో తీర్పు ఆలస్యమయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com