ఒమన్ స్కూల్ బస్లో ఎనిమిదేళ్ళ చిన్నారి దుర్మరణం
- September 07, 2018
మస్కట్:రువీలోని ఓ స్కూల్ బస్లో వుండిపోయిన ఎనిమిదేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అడ్ అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. ఉదయం నుంచి బస్సులో ఉండిపోవడం వల్ల ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన స్థితిలో కన్పించినట్లు రాయల్ పోలీస్ ఒమన్ వెల్లడించింది. బాలుడ్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారని రాయల్ ఒమన్ పోలీస్ ప్రతినిథులు చెప్పారు. బస్ డ్రైవర్లు, బస్ని లాక్ చేసే ముందు పూర్తిగా ఆ బస్సులో ఎవరూ లేరని నిర్ధారించుకోవాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ సూచించింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్ నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ఆ బస్గానీ, బస్ డ్రైవర్గానీ తమ ఫ్లీట్కి చెందినవారు కాదని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..