ఒమన్‌ స్కూల్‌ బస్‌లో ఎనిమిదేళ్ళ చిన్నారి దుర్మరణం

- September 07, 2018 , by Maagulf
ఒమన్‌ స్కూల్‌ బస్‌లో ఎనిమిదేళ్ళ చిన్నారి దుర్మరణం

మస్కట్‌:రువీలోని ఓ స్కూల్‌ బస్‌లో వుండిపోయిన ఎనిమిదేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అడ్‌ అంబులెన్స్‌ ఈ ఘటనను ధృవీకరించింది. ఉదయం నుంచి బస్సులో ఉండిపోవడం వల్ల ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన స్థితిలో కన్పించినట్లు రాయల్‌ పోలీస్‌ ఒమన్‌ వెల్లడించింది. బాలుడ్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ప్రతినిథులు చెప్పారు. బస్‌ డ్రైవర్లు, బస్‌ని లాక్‌ చేసే ముందు పూర్తిగా ఆ బస్సులో ఎవరూ లేరని నిర్ధారించుకోవాల్సి వుంటుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సూచించింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్‌ నేషనల్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ఆ బస్‌గానీ, బస్‌ డ్రైవర్‌గానీ తమ ఫ్లీట్‌కి చెందినవారు కాదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com