దేశాన్ని ప్రొటెక్ట్‌ చేస్తూ.. దేశానికి అండగా వుండాలి

- September 07, 2018 , by Maagulf
దేశాన్ని ప్రొటెక్ట్‌ చేస్తూ.. దేశానికి అండగా వుండాలి

మనామా: దేశాన్ని రక్షిస్తూ, దేశం సాధిస్తోన్న విజయాల్లో భాగమవ్వాలని బిడిఎఫ్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. బిడిఎఫ్‌ యూనిట్లను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిడిఎఫ్‌ యూనిట్లలో డెవలప్‌మెంట్‌, మోడరనైజేషన్స్‌ ప్లాన్స్‌ గురించి ఆయన కమాండర్లను అడిగి తెలుసుకున్నారు. కమాండర్లకు ఆయన విలువైన సూచనలు చేశారు. యూనిట్స్‌కి చెందిన కమాండర్స్‌, బిడిఎఫ్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌కి ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా నాయకత్వంలో దేశం మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనీ, బిడిఎఫ్‌ వెపనరీ మరియు యూనిట్స్‌ని పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా వుంచుకుందని చెప్పారు. ఈ సందర్భగా ఆయన వెంట ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా హసన్‌ అల్‌ నౌమి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com