'యు టర్న్' సినిమా సెన్సార్ పూర్తి..
- September 07, 2018
సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు టర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
యు టర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఒకేరోజు విడుదల కానుంది ఈ చిత్రం. రాహుల్ రవీంద్రన్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు యు టర్న్ చిత్రాన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!