డ్రగ్స్‌తో యూఏఈ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ వ్యక్తి
- September 07, 2018
అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి నుంచి 312 కిలోల హాషిష్ సీడ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, యూఏఈలో ఏయే డ్రగ్స్‌పై నిషేధం వుందో తనకు తెలియదంటూ పట్టుబడ్డ వ్యక్తి చెబుతున్నాడు. ఈ కేసు విచారణ అబుదాబీ క్రిమినల్ కోర్టులో జరుగుతోంది. కొన్ని నెలల క్రితం నిందితుడ్ని కస్టమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం యెదుట నిందితుడు తన వాదనను విన్పించాడు. పాకిస్తాన్ నుంచి నిందితుడు వచ్చాడు. బ్యాగ్‌లో ఓ మూల హాషిష్ సీడ్స్‌ని వుంచి నిందితుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వాటిని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడి యూరిన్ శాంపిల్‌లోనూ హాషిష్ పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ సేవించడం, అలాగే వాటిని స్మగుల్ చేయడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపారు. పాకిస్తాన్లో హాషిష్‌ని సాధారణంగా ఉపయోగిస్తామనీ, నొప్పి నివారిణిగా అవి ఉపయోగపడ్తాయని నిందితుడు చెబుతున్నాడు. సెప్టెంబర్ 11న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి